Monday, 26 December 2011

heroine shradha das injured in the rey movie sets


 
 
వై.వి.ఎస్ చౌదరికి సినిమా కష్టాలు వచ్చి పడుతున్నాయి. సినిమా మొదలు పెట్టిన తరువాత అనేక ఇబ్బందులతో సంవత్సరాలు తరబడి సినిమాలు తీయడం వై.వి.ఎస్ చౌదరికి గతంలో జరిగినదే. ఇప్పుడు రేయ్ సినిమా షూటింగ్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా, చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ హీరోగా పరిచయమవుతున్న సినిమా “రేయ్”. ఈ సినిమా పట్ల, ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న హీరోయిన్ శుభ అయ్యప్ప పట్ల ఇండస్ట్రీ జనాలు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా శ్రద్ధాదాస్ నటిస్తుంది. ఈ మధ్యే షూటింగ్ లో పాల్గొన్న శ్రద్దాదాస్ కు ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. హెవీ లైట్ కట్టర్ తల పై పడటంతో శ్రద్ధాకు గట్టి దెబ్బ తగిలింది. వైద్యుని పర్యవేక్షణలో కొద్ది సేపు రెస్ట్ తీసుకున్న తరువాత శ్రద్ధా మళ్ళీ షూటింగ్ లో పాల్గొందట. గతంలో ఇదే సినిమా షూటింగ్ లో హీరో సాయి ధరం తేజకు గాయాలవడంతో కొన్నాళ్ళు షూటింగ్ నిలిపివేశారు. ఇప్పుడు శ్రద్దాకు గాయాలయ్యాయి. అయినా కూడా వై.వి.ఎస్ పట్టుదలగా షూటింగ్ చేస్తున్నారు. వచ్చే వేసవికి ఈ రేయ్ ను విడుదల చ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment